ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

AI Second Brain Explained | మీ రెండో మెదడు ఎలా పనిచేస్తుంది?

ఈ రోజు మన “అంతర్యామితో నడక”లో పంచుకోబోయే ఆలోచనలకు ప్రాణం పోసిన బ్రియాన్ మాడెన్ కు, ఆయన టెక్ రాడార్‌లో రాసిన అద్భుతమైన “The AI second brain: The future of knowledge work” ఆర్టికల్‌కు ముందుగా నా కృతజ్ఞతలు. బ్రియాన్ మాడెన్ తన ఆర్టికల్ లో చాలా స్పష్టంగా చెప్పినట్లు, ప్రస్తుతం చాలా కంపెనీలు AI ని కేవలం ఒక 'టైప్ రైటర్' లాగా మాత్రమే వాడుతున్నాయి. అంటే ఒక ఈమెయిల్ రాయడానికో, లేదా మీటింగ్ అయ్యాక ఒక సమ్మరీ తయారు చేయడానికో మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీన్ని ఆయన కేవలం “20% పాలిష్” అని పిలుస్తున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి... అసలు మన నాలెడ్జ్ వర్క్ ఎక్కడ జరుగుతుంది? ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం, పాత సమాచారాన్ని విశ్లేషించడం, రకరకాల ఐడియాలను కలుపుకుంటూ ఒక నిర్ణయానికి రావడం... ఇదంతా మన మెదడులో నిశ్శబ్దంగా జరిగిపోయే “80% అదృశ్య పని”. అసలు వంటగదిలోకి వెళ్లి పిండి కలపకుండా, కేక్ బేక్ చేయకుండా, కేవలం గాలిలో ఉన్న కేక్ మీద క్రీమ్ పూయడానికి AI ని వాడితే ఏం లాభం?. ఆ 80% మేధోమధనంలోకి AI నేరుగా ప్రవేశించినప్పుడే మన పనితీరులో అసలైన మార్పు వస్తుంది. చాట్ జిపిటి లాంటి టూల్స్ వాడినప్పుడు ప్రతిసారీ కాంటెక్స్ట్ కొత్తగా చెప్పాల్సి రావడం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తికి మన పనిని వివరించడం లాంటిది ఇది. దీనికి పరిష్కారంగా, ప్రతిసారీ సున్నా నుండి మొదలు పెట్టకుండా, మనకంటూ ఒక “పర్సనల్ వికీపీడియా” లేదా నిరంతరం నేర్చుకునే ఒక కాంటెక్స్ట్ వాల్ట్ (context vault) ని నిర్మించుకోవాలని మాడెన్ సూచిస్తున్నారు. ఇది మీ ఆలోచనా విధానాన్ని, మీ ప్రత్యేకమైన శైలిని అర్థం చేసుకుని, మీకు ఒక పార్ట్నర్ లాగా, ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాగా వ్యవహరించే మీ “రెండో మెదడు” (Second Brain). మీరు అడగకముందే మీ ఆలోచనల సరళిని పసిగట్టి, మీకు కావాల్సిన సమాచారాన్ని సిద్ధం చేసే సాధనం ఇది. అయితే, ఇక్కడే భవిష్యత్తులో జరగబోయే అతి పెద్ద కార్పొరేట్ యుద్ధం దాగి ఉంది. ఒక ఉద్యోగి తనకంటూ సొంతంగా ఇలాంటి అద్భుతమైన 'సెకండ్ బ్రెయిన్' ను నిర్మించుకుని, రేపు అతను ఆఫీస్ మానేసి వెళ్లేటప్పుడు తన మెదడుతో పాటు ఆ డిజిటల్ మేధస్సును కూడా తన వెంటే తీసుకువెళ్ళిపోతాడనే భయం యాజమాన్యాల్లో మొదలైంది. ఈ భయంతోనే కంపెనీలు తమ డేటా బయటకు వెళ్లకుండా SSO, DLP లాంటి సెక్యూరిటీ సిస్టమ్స్ తో డిజిటల్ కంచెలు వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగుల పనితీరు, వారి ఆలోచనల ప్రక్రియ అంతా సంస్థలకు కనపడని ఒక బ్లాక్ బాక్స్ లో ఉండిపోయి, తమకు విజిబిలిటీ (పారదర్శకత) లేకుండా పోతుందనేది వారి అసలు ఆందోళన. ఈ డిజిటల్ పరిణామ క్రమాన్ని మనం కేవలం చూస్తూ కూర్చోలేము. ఒకవైపు టెక్నాలజీ మన పనులను సులభతరం చేస్తూనే, రేపు మన స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుందా అనే మౌలికమైన ప్రశ్నలను మన ముందు ఉంచుతోంది. అందుకే మన డిజిటల్ మేధో సంపత్తిని, మనం పని చేసే విధానాన్ని మనమే సొంతం చేసుకోవడం చాలా ముఖ్యం. డిజిటల్ మైగ్రేషన్ లో భాగంగా సొంత 'రెండో మెదడు'ను ఎలా నిర్మించుకోవాలి, మన 80% అదృశ్య మేధస్సుకు ఎలా రక్షణ కల్పించాలి, మరియు ఈ కార్పొరేట్ ప్రపంచపు భయాలను ఎలా దాటుకురావాలి అనే వ్యూహాలను నేర్పించడమే అంతర్యామి VA అకాడమీ (Antaryami VA Academy) ప్రధాన లక్ష్యం. ఈ స్వతంత్ర ఆలోచనా విధానం మీ ప్రయాణానికి దగ్గరగా అనిపిస్తే, మీరు కేవలం AI ని ఒక టైప్ రైటర్ లా కాకుండా మీ మేధస్సుకు ప్రతిరూపంగా మలచుకోవాలనుకుంటే... మా Antaryami VA అకాడమీ లేదా వర్చువల్ అసిస్టెంట్ నెట్‌వర్క్ వైపు ఓసారి చూడండి. మన సొంత ఆలోచనలకు పూర్తి హక్కుదారులం మనమే అయ్యే దిశగా ఆ ప్రయాణం సాగుతుంది. ఈ అద్భుతమైన డిజిటల్ ప్రయాణానికి బీజం వేసిన టెక్ రాడార్ రచయిత బ్రియాన్ మాడెన్ (“The AI second brain: The future of knowledge work”) కు హృదయపూర్వక కృతజ్ఞతలు ; మీరు కూడా AI ని కేవలం టైప్‌రైటర్‌లా వాడటం మానేసి, మీ 80% అదృశ్య మేధస్సుకు మీరే పూర్తి హక్కుదారులం కావాలనుకుంటే, Antaryami VA అకాడమీ లో మాతో కలిసి మీ సొంత context vault ను నిర్మించుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం

కామెంట్‌లు

లేబుళ్లు

ఎక్కువ చూపు